వందేమాతరం దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం

తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్07

అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం వందేమాతరానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం సామూహిక గేయా ఆలాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని వందేమాతర గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ వందేమాతరం మన జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన శక్తివంతమైన గేయమని. స్వాతంత్ర్య సమరయోధులు ఈ గేయం ద్వారా ప్రజల్లో జాతీయ స్పూర్తిని కలిగించారని ,ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క చరిత్రను తెలుసుకొని గౌరవంతో గానం చేయాలని. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe