అశోక్ నగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
తెలంగాణ కేసరి ఖానాపురం, వెబ్ డెస్క్ నవంబర్06
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం పరిధిలోని అశోక్ నగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నికను శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా జాడి అచ్యుతం, యూత్ అధ్యక్షుడిగా గోనెల మురళి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, హరిబాబు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తను సమన్వయపరచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వీరమనేని సాగర్ రావు, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె ముస్తఫా, మండల నాయకులు దేవినేని వేణుగోపాల్ రావు, పల్నాటి శ్రీను, మండల కమిటీ బాధ్యులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.