అట్టహాసంగా ప్రారంభమైన గురుకుల పదకొండవ జోనల్ స్థాయి క్రీడలు

అట్టహాసంగా ప్రారంభమైన గురుకుల పదకొండవ జోనల్ స్థాయి క్రీడలు

తెలంగాణ కేసరి, ఆలేరు, నవంబర్ 06

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పదకొండవ జోనల్ స్థాయి క్రీడలు బాలుర విభాగంలో ఈనెల 6వ తేది నుండి 8వ తేది వరకు జరుపబడుచున్న విషయం అందరికీ తెలిసినదే.ఇందులో భాగంగా మొదటిరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల రాజాపేటలో గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథుగా జనగాం డిసిఒ పి.శ్రీనివాస్ రావు,యాదాద్రి భువనగిరి డిసిఓ పి.సుధాకర్ మరియు ప్రిన్సిపల్స్ హాజరయ్యారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన పి.శ్రీనివాస్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించినారు. వందేమాతరం జాతీయగీతంను ఆలపించి జాతీయ ఒలింపిక్స్,సొసైటీ జెండాలను ఎగురవేశారు.ఇందులో భాగంగా వివిధ కళాశాలల నుండి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ ను అంగరంగ వైభోగంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి పి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ..ఈ క్రీడల పోటీలను స్ఫూర్తిగా తీసుకొని,రాష్ట్ర,జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు మీరు ఎదగాలని క్రీడాకారులను ఉత్తేజపరిచారు.
యాదాద్రి డి సి ఓ పి.సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు శారీరకంగా,మానసిక అభివృద్ధికి క్రీడలు చాలా కీలకమని,అదేవిదంగా జీవితంలో
గెలుపు ఓటములు సహజమని,ఓటమే రేపటి విజయానికి తొలమెట్టు అని తెలిపుతూ విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించుటకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.నిరంతర సాధనతోనే విద్యార్దులు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తారని చెప్పి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.విద్యార్థులు సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ విద్యార్థులు ఇంకా అన్ని రంగాలలో ప్రగతిని సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో క్రీడల సమన్వయకర్త జి.శ్రీనివాస్,పి.డి వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe