మోదీజీ మీ..చర్మ రహాస్యం ఏమిటి..??

మోదీజీ మీ..చర్మ రహాస్యం ఏమిటి..??

ప్రధానికి హర్లీన్ ఫన్నీ క్వశ్చన్

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ నవంబర్ 06

విశ్వ విజేతలుగా నిలిచిన భారత మహిళల జట్టుతో దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. వరల్డ్కప్ విజయం పట్ల ఛాంపియన్లను మోదీ అభినందించారు. వాళ్లతో సరదాగా చర్చించారు. ఈ సందర్భంగా మోదీ ఒక్కొక్కరితో మాట్లాడారు. అయితే యంగ్ బ్యాటర్ హర్లీన్ డియోల్ తనవంతు రాగానే మోదీని అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. సర్, మీ స్కిన్‌ కేర్ రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ స్కిన్ ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది’ అని సరదాగా అడిగేసింది. దీంతో అక్కడున్నవాళ్లు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. హర్లిన్ ప్రశ్నకు మోదీ కూడా నవ్వేశారు. ఈ ప్రశ్నకు మోదీ స్పందించారు. ‘నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోను’ అని రిప్లై ఇచ్చారు. ఇంతలో ‘ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అని టీమ్ మెంబర్ ఒకరు అన్నారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘అది కూడా కొవొచ్చు, 25ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నాను కదా. వాళ్ల ప్రేమ వల్లే అనుకుంటా’ అని మోదీ సమాధానం ఇచ్చారు.

WhatsApp Join Now
Youtube Subscribe