తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్06
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో వాటర్ ప్లాంట్ యజమానులతో అవగాహన సదస్సు గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు పర్మిషన్ తెచ్చుకోవాలని రెండు నెలల గడువు ఇస్తున్నామని తెలిపినారు. ఐఎస్ఐ మార్కు లేకుండా మంచినీటి సరఫరా చేయడం నేరం మీరు ఇప్పుడు సప్లై చేసే మంచినీటిని శుద్ధి చేసి ఇవ్వాలని మీరు నీటిని సప్లై చేసేటప్పుడు వినియోగించే ప్లాస్టిక్ డబ్బాలను మంచిగా కడిగి మంచినీరు అందివ్వాలని మీరిచ్చే మంచినీటి వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మంచినీరు కలుషితం వలన ప్రజలు జ్వరాల బారినపడి అనారోగ్యాల పాలవుతారని మంచినీరు కలుషితం కాకుండా చూడాలని తెలిపినారు. మంచినీరు డబ్బాలు కడగకుండా నింపుకొని సప్లై చేస్తున్నారని మా దృష్టికి వచ్చినది అలా చేసినచో కఠిన చర్యలు తప్పవని తెలిపినారు రెండు నెలల్లో ఐఎస్ఐ మార్కు పర్మిషన్ కచ్చితంగా తెచ్చుకోవాలని ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ ముజీబ్ వాటర్ ప్లాంట్ యజమానులు పాల్గొన్నారు.