జర్నలిస్టులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి

తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్06

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్తులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. గురువారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో పాటు దిగు తిరుపతిలో కొలువై ఉన్న పద్మావతి అమ్మవారిని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి మంజుల దంపతులు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ లు వెంటనే ఇవ్వాలని. వెంటనే అక్రిడేషన్ కమిటీలను జిల్లాల వారీగా వేయాలని మొక్కినట్లు ఆయన వివరించారు. రైల్వే పాసులను పునరుద్దరించాలని, హెల్త్ కార్డులివ్వాలని,కోర్టు తీర్పు పేరుతో కాలయాపన చేయకుండా రాష్ట్రంలో అర్హులైన జర్నలిసస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించేలా చూడాలని స్వామిని కోరానని కిషన్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని, ఇటీవల జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం జర్నలిస్తులతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వo అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించేలా పాలన అందించేవిధంగా స్వామి వారు దీవెనలు ఎల్లవేళలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, మంజుల, పెండ్యాల శశిధర్ రెడ్డి, శ్రీలత, రాళ్ళబండి చంద్రశేఖర్ రెడ్డి, సాహితీ, పెండ్యాల సుజాత, విజయ, శారద, పవిత, కమల, గౌతమి, గౌరీ, పద్మ, భవాని, శైలజ, లక్ష్మి,వికాస్ రెడ్డి – మౌనిక, అబ్బిడి మల్లారెడ్డి, అబ్బిడి లక్ష్మా రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, అబ్బిడి గౌతమ్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, పాతురి రవీందర్ రెడ్డి, సుధీరెడ్డి రమేష్ రెడ్డి, అబ్బిడి రాజిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, జయపాల్ రెడ్డి, బండ అశోక్ రెడ్డి, తదితరులున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe