విద్యుత్ ఘాతంతో పాడి గేదే , వృద్దుడు మృతి
తెలంగాణ కేసరి, రామన్నపేట, నవంబర్ 06
విద్యుత్ ఘాతానికి గురియై వృద్దుడు, పాడిగేదే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన గేదెల కాపరి గొర్ల మల్లయ్య(70) రోజు మాదిరిగానే తన గేదెలను మేపడానికి వెళ్ళాడు. బుధవారం దాదాపు సాయంత్రం ఓ గేదే పొలం వైపు వెళ్లడంతో కొట్టుకురావడానికి వెళ్లాడు. తెగిపడి ఉన్న సర్వీస్ వైర్ బురద పొలంలో పడి ఉన్నది.అది గమనించకపోవడంతో వేస్తున్న గేదెను తను పక్కకు కొట్టే ప్రయత్నంలో షాక్ కు గురై వృద్ధుడు, గేదె అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి అయిన మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఉదయం బావుల వద్దకు వెళ్తున్న మృతుడు మల్లయ్యను రైతులు చూడటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.