విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
– కళాశాల ప్రిన్సిపాల్ రాహత్ ఖానం
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 04
విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, పర్యావరణ పరిరక్షణ కలిగింపజేయాలన్న సంకల్పాన్ని పెంపొందింప చేయడం ప్రధాన ఉద్దేశ్యాలుగా ఈ ఎకో బజార్ నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాహత్ ఖానం అన్నారు.మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత ఎకో బజారును నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…విద్యార్థులచే వివిధ వస్తువులు, తినుబండారాలు ప్లాస్టిక్ రహిత పదార్థాలతో కూడిన 16 స్టాళ్ళను ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగిందని తెలిపారు.తెలంగాణ పిండివంటలను విద్యార్థులే స్వయంగా తయారుచేసి ఈ స్టాళ్ళలో అమ్మడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు సందర్శించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సి. జగదీష్ మాట్లాడుతూ …ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు చదువుతోపాటు మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉపాధిని పొందే అవకాశం ఉంటుందని అన్నారు. రామన్నపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు విచ్చేసి స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్య ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు, పాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ రత్న మంజుల, డాక్టర్ జి. సునీత,డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. బ్రహ్మం, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ ఆర్. శ్రీను, టి. శ్రీనివాస్, బాలరాజు, అమర్, నరేష్ ,ఆంజనేయులు, రవి, రాధిక తదితర అధ్యాపకులతో పాటు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.