లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్ ,రామన్నపేట, నవంబర్ 04

ఈ నెల 15న నిర్వహించనున్న లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష అన్నారు.రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో మంగళవారం నాడు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ… పెండింగ్ లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు, న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడానికి కక్షిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, రామన్నపేట, వలిగొండ, ఎస్ఐ లు డి.నాగరాజు, యుగేందర్ గౌడ్, నాగరాజు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe