సదర్ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్
తెలంగాణ కేసరి యాదాద్రి భువనగిరి నవంబర్ 03
ఈ నెల 8వ తేదీన శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా కమిటీ అధ్యర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సదర్ ఉత్సవ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్ అన్నారు.భువనగిరిలోని వందన హోటల్ లో సోమవారం నాడు ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలోని యాదవ కుటుంబ సభ్యులు , ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాద మల్లయ్య యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్,నక్కల చిరంజీవి యాదవ్,జిల్లా కోఆర్డినేట్ ఆవిశెట్టి రమేష్ యాదవ్,జిల్లా యూత్ అధ్యక్షులు ర్యాకల రమేష్ యాదవ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరాం శరత్ యాదవ్, కడరి నరేష్ యాదవ్,రసాల నవీన్ యాదవ్,ఎరుసని సాయి యాదవ్, తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు.