అంగన్ వాడి సేవలు విస్తృతపరచాలి

అంగన్ వాడి సేవలు విస్తృతపరచాలి

జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ

తెలంగాణ కేసరి భద్రాద్రి కొత్తగూడెం 03

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి క్షేత్రస్థాయిలో అంగనవాడి సేవలు విస్తృతపరచాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హల్ నందు జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనినా అధ్యక్షతన జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ ప్రతి అంగనవాడి కేంద్రంలో పిల్లల ఎత్తు బరువు క్రమం తప్పకుండా త్రూచి వారి పెరుగుదల పర్యవేక్షణ పై సమగ్ర నివేదిక అందజేస్తూ పోషణలోప నివారనకు చర్యలు చేపట్టాలని, తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను వైద్యశాఖ సమన్వయంతో పరీక్షలు నిర్వహించి న్యూట్రిషన్ రిహాబిటేషన్ కేంద్రానికి సిఫార్సు చేసి పోషణలోప నివారణకు చర్యలు చేపట్టాలన్నారు, జిల్లాలో 295 అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకాలు చేపట్టడం జరుగుతుందని, తద్వారా వచ్చే పౌష్టికారం అంగనవాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు అందజేసి పౌష్టిక విలువలు పెంపొందించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో వివిధ పథకాల ద్వారా మంజూరైన పక్కా భవనాలు, త్రాగునీరు, టాయిలెట్స్ త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలో నమోదైన లబ్ధిదారుల హాజరు శాతం వేయాలని ప్రతిరోజు అంగనవాడి కేంద్రం 9 గంటల లోపు తెరిచి షెడ్యూల్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిని జే స్వర్ణలత లెనినా , జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపర్డెంట్ ముత్తయ్య, సీనియర్ అసిస్టెంట్ పాషా, జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, పోషన్ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe