భగవద్గీత కంఠస్థ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం
హిందూ ధర్మ ప్రచార పరిషత్ కో-ఆర్డినేటర్ కర్నాటి రామకృష్ణారెడ్డి
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ అక్టోబర్ 24
తిరుమల తిరు పతి దేవస్థానము హిం దూ ధర్మ ప్రచార పరిషత్ ఖమ్మం జిల్లాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించే భగవద్గీత కంఠస్థ పోటీలకు విద్యార్థులు దరఖాస్తులు చేసు కోవాలని కో-ఆర్డినేటర్ హిందూ ధర్మ ప్రచార పరి షత్ రామకృష్ణారెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
ఈ భగవద్గీత కంఠస్థ పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందు స్వర్ణభారతి హై స్కూల్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో 2025 నవంబర్ 22వ తేదీన నిర్వహించనున్నాన్నారు.
ఖమ్మం జిల్లాలో..
హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యా లయం ఖమ్మంలో 2025 నవంబర్ 26వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు రెండు జిల్లాల లో భగవద్గీత కంఠస్థ పోటీలు 6,7, 8, 9 తరగతుల విద్యార్థులకు 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగము 16 వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగయోగము పదవ తరగతి,ఇంటర్ విద్యార్థులకు 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలలోపు వారికి మూడు విభాగాలలో పోటీలు కలవు కావున విద్యార్థిని విద్యార్థులతో పాటు పెద్దవాళ్ళకు కూడా తెలియ పరుస్తున్నాము. ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు మూ డు విభాగాలలో బహుమతులు ప్రత్యేకంగా కలవు… 2025 డిసెంబర్ 01వ తేదీన సోమవారం గీతా జయంతిని పురస్కరించుకొని భగవ ద్గీత కంఠస్థ పోటీలను రెండు జిల్లాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి కార్యనిర్వాహణా ధికారి అనిల్ కుమార్ సింగల్,ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రఘునాథ్ తెలంగాణ ప్రాంత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చతుర్వేదల సత్య నారాయణ వీరి సంకల్పంతో మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో నిర్వహించబడే పోటీలకు విద్యా ర్థులను సిద్ధం చేయగలరని కోరుతున్నాం.
పూర్తి వివరాలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమ నిర్వాహకులు కర్నాటి రామకృష్ణారెడ్డి 6300538706 ను సంప్రదించగలరు.