మొక్కజొన్న పంటను మద్దతు ధరకు విక్రయించాలి….

మొక్కజొన్న పంటను మద్దతు ధరకు విక్రయించాలి….

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

2025-26 మార్కెటింగ్ సీజన్ లో మొక్క జొన్న కొనుగోలుకు జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ అక్టోబర్ -24

2025-26 మార్కెటింగ్ సీజన్ లో మొక్క జొన్న పంటకు ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు 2 వేల 400 రూపాయలు కనీస మద్దతు ధరను ప్రకటించిందని, మద్దతు ధరకు పంట కొనుగోలుకు పక్కా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1705 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 5456 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి అంచనాతో, రైతుల నుంచి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు జిల్లా వ్యాప్తంగా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా, రైతులు తమ పంటను తడి శాతం 14 శాతం లోపు ఉండేలా చూసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మధిర, ఎర్రుపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లలో, ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ళ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో, సింగరేణి మండలం మాదారంలో కారేపల్లి సహకార సొసైటీ లో, ముదిగొండలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులందరూ తేమ శాతం 14 శాతం లోపు ఉన్న పంటలను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe