అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం

తెలంగాణ కేసరి కొత్తగూడెం అక్టోబర్ 21

 

అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఆన్నారు. చిన్నజీయర్ స్వామి జన్మదినం సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. గత 2 సంవత్సరాలనుండి ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు నాడు అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి స్వీట్స్ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కోనేరు.చిన్ని,తాటిపల్లి. శంకర్ బాబు, కొదుమురి శ్రీనివాస్, కంభంపాటి రమేష్, గునపాటి.ఆనంద్, జీవీ, సంకా. శ్రీనివాసరావు, అయిత ప్రకాశ్, శ్రీనివాస్,ఉమామహేశ్వరరావు, వీరభద్రం,దారా.రమేష్,రోజా,రావి రాంబాబు,హరి సురేష్,శ్రీనివాస్, నాగేశ్వరావు మరియు పరప్రముఖులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe